- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓయూ మాజీ రిజిస్ట్రార్ మృతిపై ఉపకులపతి సంతాపం
ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ అకాల మరణం పట్ల విశ్వవిద్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ అకాల మరణం పట్ల విశ్వవిద్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ.. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మరణం విద్యారంగానికి, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తీరని లోటని పేర్కొన్నారు. ఉత్తమ అధ్యాపకుడిగా, దూరదృష్టి కలిగిన పరిపాలనా అధికారిగా ఆయన విశ్వవిద్యాలయానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విశ్వవిద్యాలయం అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర విశేషమైందని, వివిధ హోదాల్లో చేసిన సేవలు ఓయూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన సేవలను విశ్వవిద్యాలయం అధికారిక రికార్డుల్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషాద సమయంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి విశ్వవిద్యాలయం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.






