- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాయిదంపల్లిలో తాగునీటి కష్టాలు
by Jakkula.Mamatha |
మండల పరిధిలోని కాయిదంపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో గత మూడు నెలల నుంచి తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు సోమవారం ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నారు.

X
దిశ,అల్లాదుర్గం: మండల పరిధిలోని కాయిదంపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో గత మూడు నెలల నుంచి తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు సోమవారం ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నారు. గత మూడు నెలల నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా అందించే త్రాగునీటి సరఫరా అరకొరగా అందుతుందని, దీంతో దైనందిన కార్యక్రమాలు ఎలా నిర్వహించుకోవాలని, తాగునీటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని గ్రామస్తులు అడగ్గా సర్పంచ్‌కు చెప్పాలంటూ ఆయన తెలియజేస్తే, సర్పంచ్ పైనుండే ప్రెషర్ తక్కువగా వస్తుందంటూ బదులిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఆగ్రహించిన కాలనీవాసులు సోమవారం ప్రజావాణికి ఖాళీ బిందెలతో వచ్చి సంబంధిత అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీకి క్రమం తప్పకుండా తాగునీటి సరఫరా అందించాలని కోరారు.
Next Story






