- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిద్రలోనే తల్లి, బిడ్డను కాటేసిన పాము.. చిన్నారి మృతి, తల్లికి చికిత్స!
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము ఇంట్లోకి దూరి తల్లి బిడ్డను కాటు వేసింది.

X
దిశ, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము ఇంట్లోకి దూరి తల్లి బిడ్డను కాటు వేసింది. గ్రామస్తులు, కుటుంబీకుల వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న శంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబీకులు రాత్రి నివాస గుడిసెలో నిద్రిస్తున్నారు. నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి పాము వచ్చి నాగరాజు భార్య లావణ్యకు, కూతురు హారికను కాటు వేసింది. లావణ్యకు రక్తం రావడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి నార్సింగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు హారిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి లావణ్య చికిత్స పొందుతుంది. హారిక మల్లుపల్లి ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుకుంటుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
Next Story






