మునగాల నూతన మెడికల్ ఆఫీసర్ మలిశెట్టి సుశాంత్ బాధ్యతలు స్వీకరణ

by Jakkula.Mamatha |

మునగాల నూతన మెడికల్ ఆఫీసర్ మలిశెట్టి సుశాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

మునగాల నూతన మెడికల్ ఆఫీసర్ మలిశెట్టి సుశాంత్ బాధ్యతలు స్వీకరణ
X

దిశ, మునగాల: మునగాల నూతన మెడికల్ ఆఫీసర్ మలిశెట్టి సుశాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన సూర్యాపేట జిల్లా చివ్వెంల ప్రభుత్వ దేశాలలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసి బదిలీపై మునగాల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. ఈ సందర్భంగా మునగాల వైద్య సిబ్బంది నూతన మెడికల్ ఆఫీసర్‌కు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ సుశాంత్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలను అదే విధంగా చర్యలు తీసుకుంటానని ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందేలా కృషి చేస్తానని ఆయన అన్నారు.

Next Story