బేకరీలలో మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

by Jakkula.Mamatha |

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పలు హోటల్స్, బేకరీలలో సోమవారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

బేకరీలలో మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
X

దిశ,బైంసా: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పలు హోటల్స్, బేకరీలలో సోమవారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత, ప్లాస్టిక్ వాడడం, అధిక రసాయనాల వినియోగం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. హోటళ్లు, బేకరీల నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని అధిక రసాయనాల వినియోగం అనిపించినట్లయితే పూర్తి మొత్తంలో కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత దుకాణ సముదాయల యజమానులను హెచ్చరించారు. తనిఖీలలో శానిటైజర్ ఇన్‌స్పెక్టర్ మురారి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story