- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్ల బాలికపై అత్యాచారం.. సెటిల్మెంట్ డబ్బుతో పంచాయతీ పెద్దల జల్సా!
జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు.. పంచాయతీ పెద్దలే నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించారు.

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు.. పంచాయతీ పెద్దలే నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించారు. ఆ డబ్బులో ముందుగా రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించారు. అవి చేతికి రావడమే ఆలస్యం.. మాంసం, మద్యంతో విందు చేసుకున్నారు. మిగతా రూ.80 వేలు బాధిత కుటుంబానికి చెల్లించాలని పంచాయతీ తీర్పునిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీక్రెట్ సెటిల్మెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు.. విషయంలో జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. దీంతో విషయం బయటికి తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్మా గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని పంచాయతీ ద్వారా పరిష్కరించి, ఈ విషయం అధికారుల వరకు వెళ్లకుండా గ్రామస్థులు ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. గ్రామస్తుల ఒత్తిడితో విషయాన్ని పోలీసులకు చెప్పలేదని తెలిపారు. ఆ తర్వాత పోలీసుల దృష్టికి ఈ విషయం చేరడంతో.. బాధితురాలి తల్లి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసి కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో సునీల్ లోహ్రా అనే నిందితుడు బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లి ఇంట్లోనే ఉంది. ఆమె తన పని ముగించుకునేంతవరకూ.. తానే పాపను చూసుకుంటానని లోహ్రా నమ్మించాడు. ఆ తర్వాత లోహ్రా పాపను ఒక గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలిక ఏడుపు విన్న తల్లి లోపలికి పరుగెత్తగా, పాప రక్తస్రావంతో కనిపించింది. ఈ ఘోరంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బదులుగా గ్రామ పంచాయతీ ముందుకు తీసుకెళ్లారు.
ఫిర్యాదు ప్రకారం.. పంచాయతీకి చెందిన కొందరు సభ్యులు మొదట ఆ చిన్నారిని ఒక ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆపై ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి, విషయాన్ని గ్రామంలోనే తేల్చేసే ప్రయత్నంలో నిందితుడికి రూ.1 లక్ష జరిమానా విధించాలని నిర్ణయించారు. దీనిపై నిందితుడు అక్కడికక్కడే రూ.20,000 చెల్లించగా, మిగిలిన రూ.80,000 వారంలోగా డిపాజిట్ చేయాలని పంచాయతీ ఆదేశించింది. ఈ కేసును తొక్కిపెట్టే ప్రయత్నాన్ని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రహస్యంగా పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసు బృందం ఆదివారం గ్రామానికి చేరుకుంది. అరంగి పంచాయతీ సర్పంచ్ (ముఖియా) లోడో ఎక్కా మాట్లాడుతూ.. పాల్మా గ్రామంలో చిన్నారిపై అత్యాచారం జరిగిన తర్వాత కొందరు గ్రామస్థులు సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు. "ఈ సమావేశం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని, విషయం వెలుగులోకి వచ్చిన తర్వాతే తనకు తెలిసిందన్నారు.






