భూపాలపల్లి జిల్లాలో దారుణం.. డీటీవో వెంకన్న దుర్మరణం

by Jakkula.Mamatha |

భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చేలుపూరు గ్రామంలోని ఆర్టీవో కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు

భూపాలపల్లి జిల్లాలో దారుణం.. డీటీవో వెంకన్న దుర్మరణం
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చేలుపూరు గ్రామంలోని ఆర్టీవో కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి తన విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో రోడ్డు వద్ద నిలబడగా బొగ్గు టిప్పర్ డీటీవో పై నుండి దూసుకెళ్లడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. జిల్లా రవాణా అధికారి మృతి చెందడం పై భూపాలపల్లిలో ఒక్కసారి విషాద ఛాయలు నెలకొన్నాయి.

గత 15 రోజుల క్రితమే వెంకన్న జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన నిత్యం వాహనాల తనిఖీలు చేయడంతోపాటు భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాల బస్సులు సైతం ఫిట్నెస్ చేయించారు. జిల్లాకు బదిలీ పై వచ్చి రాగానే తనకంటూ ఒక ముద్ర వేసుకున్న వెంకన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీవో ఆఫీస్ లో ఏవో ఒక పని చేస్తున్న రజిత సైతం తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకన్న మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story