నా కష్టాలు నా బిడ్డకు వద్దు.. అన్నీ వదిలేసి తనే ప్రపంచంగా బతుకుతా: సమంత

by Mallepaka Hamsa |

తనకు పుట్టబోయే బిడ్డే ఇకపై తన సర్వస్వం అని సమంత పేర్కొన్నారు.

నా కష్టాలు నా బిడ్డకు వద్దు.. అన్నీ వదిలేసి తనే ప్రపంచంగా బతుకుతా: సమంత
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బిగ్ స్క్రీన్‌పై కనిపించి అభిమానులకు తన విశ్వరూపం చూపించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19న విడుదల కాగా.. హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.ఇక ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సామ్ తల్లి కానుందనే వార్తలు కూడా వస్తున్నాయి. బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమంత తనకు పుట్టబోయే పిల్లల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనకు పుట్టబోయే బిడ్డే ఇకపై తన సర్వస్వం అని సమంత పేర్కొన్నారు. ఒకవైపు ఉద్యోగం లేదా కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూనే, మరోవైపు పిల్లలను, ఇంటి బాధ్యతలను ఎంతో ఓపికగా చూసుకునే మహిళలంటే తనకు ఎంతో గౌరవమని ఆమె చెప్పారు. అలాంటి శ్రామిక తల్లులు ప్రతి ఒక్కరికీ రోల్ మోడల్స్ అని కొనియాడారు. ఇదే క్రమంలో సమంత తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

తాను చిన్నప్పుడు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడ్డానని ఆమె గుర్తు చేసుకున్నారు. సాధారణంగా చిన్నతనంలో కష్టాలు పడి పెరిగిన వారెవరైనా.. తమ పిల్లలకు అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటారని, వారికి అన్ని రకాల విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని అందించాలని ఆరాటపడతారని చెప్పారు. తాను కూడా తన బిడ్డ విషయంలో అదే నిర్ణయం తీసుకున్నానని, తన బిడ్డకు ఎలాంటి లోటూ లేకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. అంతేకాకుండా, బిడ్డ పుట్టిన తర్వాత కెరీర్ కంటే మాతృత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని సమంత వెల్లడించారు. కొన్ని సంవత్సరాల పాటు బిడ్డను ఒంటరిగా వదిలి తాను ఎక్కడికీ వెళ్లనని, పూర్తిగా తన సమయాన్ని బిడ్డ కోసమే కేటాయిస్తానని చెప్పారు. తన బిడ్డే తన ప్రపంచంగా బతుకుతానని సమంత వెల్లడించారు. అయితే ఈ కామెంట్స్ గతంలో చేసినవైనప్పటికీ.. సమంత తల్లి కాబోతుందన్న వార్తలు వైరల్ అవుతుండటంతో మరోసారి ఈ కామెంట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.

Next Story