- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ టీచర్, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రభుత్వ ఆదేశాల మేరకు శాలిగౌరారం మండలంలోని మూడు ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా మంజూరైన ప్రీ ప్రైమరీ తరగతులకు బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మండల విద్యాధికారి సైదులు ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ,శాలిగౌరారం: ప్రభుత్వ ఆదేశాల మేరకు శాలిగౌరారం మండలంలోని మూడు ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా మంజూరైన ప్రీ ప్రైమరీ తరగతులకు బోధించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మండల విద్యాధికారి సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అడ్లూరు ప్రాథమిక పాఠశాల, ఆకారం ప్రాథమిక పాఠశాల,పెర్క కొండారం ప్రాథమిక పాఠశాలలో తరగతులు ప్రారంభం కానున్నాయని, టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ (డి.ఈడి ఉన్న వారికీ ప్రాధాన్యత), ఆయా పోస్టుకు 7వ తరగతి విద్యార్హత ఉండి, మార్కుల షీట్ ను దరఖాస్తుకు జత చేయాలని తెలిపారు. అర్హత గల వయసు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు ఈ నెల 22 నుంచి 26 సాయంత్రం 4 గంటల లోగా స్థానిక ఎంఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.






