- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర మంత్రులతో సీఎం సమావేశాలకు సమన్వయం చేశా.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రైల్వేశాఖ మంత్రులతో సమావేశం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు లేఖలు రాసిన నేపథ్యంలో సమావేశాల కోసం చొరవతీసుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో:హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్తరణపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, మనోహర్ లాల్ కట్టర్‍తో సీఎం జరిగిన చర్చలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‍తో సమావేశం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు లేఖలు రాశారని ఈ నేపథ్యంలో గత రెండ్రోజులుగా ఢిల్లీలో ఇద్దరు కేంద్రమంత్రులతో సమావేశాల కోసం చొరవతీసుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా, రేవంత్ రెడ్డి, నేను కలిసి నిన్న అశ్వినీ వైష్ణవ్‍తో, ఇవాళ మనోహర్ లాల్ ఖట్టర్‍తో సమావేశం అయ్యామని కేంద్రమంత్రులతో సీఎం సమావేశాలకు సమన్వయం చేశానని చెప్పారు ఈ రెండు సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగినట్లు వెల్లడించారు. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేను రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం నావంతు కృషిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి పోస్టు చేశారు.
కన్సల్టెంట్‍గా SBICAPS:
ఇదిలా ఉంటే రెండు రోజులుగా సీఎం కేంద్రంతో జరుపుతున్న చర్చలు సఫలం అయ్యాయి. ఈ సందర్బంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- I వాల్యూయేషన్... ఫేజ్-I స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్-II విస్తరణ.. నిర్మాణ వ్యయం అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‍ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్‌గా SBICAPSని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్-I వాల్యూయేషన్... ఫేజ్-II విస్తరణ...ఇతర అంశాలపై SBICAPS సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు. కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి (MA &UD) శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషి చేయనున్నారు.






