- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ తేదీపై కన్నేసిన సంయుక్త మీనన్.. 'బ్లాక్ గోల్డ్' విడుదలపై సూపర్ అప్డేట్
సంయుక్తా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ది బ్లాక్ గోల్డ్' చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి సంయుక్తా మీనన్ ప్రస్తుతం 'ది బ్లాక్ గోల్డ్' చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటివరకు క్లాస్, డీసెంట్ పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ, ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొదట ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, సినిమా సమ్మర్ రేస్ నుంచి తప్పుకుంది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆగస్టు 14న సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యోగేశ్ కెఎంసీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్లపై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు.






