బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

by Pulgam srinivas |

బాలకృష్ణ - కొరటాల కాంబో చిత్ర ప్రారంభోత్సవం జూన్ 25న వెంకటపాలెం టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగనుంది.

బాలకృష్ణ - కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: బాలకృష్ణ, స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు అధికారిక టైటిల్ ఖరారు కాకపోవడంతో ‘NBK112’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ వేడుక వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. జూన్ 25, 2026 ఉదయం 9 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటపాలెం టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు హెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రి నారా లోకేష్, పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. “A Powerful Combo, An Exciting Beginning” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.




Next Story