- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీరామనవమి శోభాయాత్ర.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. భక్తుల రద్దీ, యాత్ర సాగే మార్గాన్ని బట్టి దశలవారీగా వాహనాల రాకపోకలను నియంత్రిస్తారు.
యాత్ర సాగే ప్రధాన మార్గాలు
ఈ యాత్ర కోఠిలోని సీతారాంబాగ్ దేవాలయం నుండి ప్రారంభమై సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల (రాయల్ ప్లాజా టి-జంక్షన్) వద్ద ముగుస్తుంది. సీతారాంబాగ్ వద్ద మొదలయ్యే యాత్ర భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్ పి.ఎస్. రోడ్, జాలి హనుమాన్, ధూల్‌పేట్, పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమేరాత్ బజార్, చూడి బజార్, బేగంబజార్ ఛత్రి, బర్తాన్ బజార్, సిద్దిఅంబర్ బజార్, శంకర్ షెర్ హోటల్, గౌలిగూడ చమన్, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ ఎక్స్ రోడ్, డీఎంహెచ్‌ఎస్ ఎక్స్ రోడ్ మీదుగా సుల్తాన్ బజార్ కు చేరుకుంటుంది.
ట్రాఫిక్ డైవర్షన్స్
సీతారాంబాగ్ మరియు భోయిగూడ కమాన్ నుండి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ మీదుగా విజయనగర్ కాలనీ లేదా మెహదీపట్నం వైపు మళ్లిస్తారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం మరియు పురానాపూల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను టక్కర్‌వాడి, అఘాపుర లేదా హబీబ్ నగర్ వైపు మళ్లిస్తారు. బేగంబజార్, అఫ్జల్‌గంజ్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు జుమేరాత్ బజార్ మీదుగా డైవర్ట్ అవుతాయి. అబిడ్స్ జీపీఓ, బ్యాంక్ స్ట్రీట్ వైపు యాత్ర ఉన్న సమయంలో వాహనాలను అనుమతించరు. వీటిని ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ నుండి వచ్చే వాహనాలను రామ్‌కోటి వైపు, అలాగే కాచిగూడ వైపు నుండి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు.
వాహనదారులకు అలర్ట్
బేగంబజార్ ఛత్రి, అఫ్జల్‌గంజ్ టి-జంక్షన్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి, కోఠి, జీపీఓ అబిడ్స్, కాచిగూడ ఎక్స్ రోడ్, శివాజీ బ్రిడ్జ్ మరియు సీబీఎస్ ప్రాంతాల్లో తీవ్రమైన రద్దీ ఉండే అవకాశం ఉండటం వల్ల వాహనదారులు సాధ్యమైనంత వరకు మెహదీపట్నం, నాంపల్లి, రామ్‌కోటి, చాదర్‌ఘాట్ వంటి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. శోభాయాత్ర ఒక జంక్షన్ దాటి ముందుకు వెళ్లే కొద్దీ, వెనుక ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు క్రమంగా సడలిస్తారు.






