- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన H-CITI ప్రాజెక్ట్ పనుల నిమిత్తం ఏప్రిల్ 5న ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్. కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన H-CITI ప్రాజెక్ట్ లోని స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నిమిత్తం ఏప్రిల్ 5న ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వన్-వే ట్రయల్ రన్ (One-Way Trial Run) నిర్వహించనున్నారు. ఈ రెండు గంటల వ్యవధిలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలులో ఉంటాయి కాబట్టి, ఆ మార్గాల్లో వెళ్లేవారు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నంబర్ 2, 36, 45 మరియు లోటస్ పాండ్ ముగ్ధ జంక్షన్ వంటి ప్రాంతాల్లో ఈ ఆంక్షలు ఉండనున్నాయి. ట్రయల్ రన్ సమయంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్లపై యూ-టర్న్‌లు పూర్తిగా నిషేధించబడ్డాయి. సాగర్ సొసైటీ నుండి కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వరకు ఉండే రహదారులపై రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ విభాగం సూచించింది.






