- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖబర్దార్ తాతా మధు.. నోరు అదపులో పెట్టుకో : మద్దినేని బేబీ కుమారి
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు నోరు అదపులో పెట్టుకోవాలని, రాష్ట్ర పార్టీ దగ్గర మార్కులు కొట్టేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఖబర్దార్ అని టీపీసీ సభ్యురాలు మద్దినేని బేబీ కుమారి ఫైర్ అయ్యారు.

దిశ, ఖమ్మం రూరల్ : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు నోరు అదపులో పెట్టుకోవాలని, రాష్ట్ర పార్టీ దగ్గర మార్కులు కొట్టేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఖబర్దార్ అని టీపీసీ సభ్యురాలు మద్దినేని బేబీ కుమారి ఫైర్ అయ్యారు. అర్హత లేని వ్యక్తులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదమని ఆమె మండిపడ్డారు. శనివారం ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పొకబత్తిని అనిత క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవలో నిరంతరం ముందుండే నాయకుడి పై విమర్శలు చేయడం తగదన్నారు. వ్యక్తిగత విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ లబ్ధిపొందాలని చూసే వారిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జిల్లాలో మంత్రి పొంగులేటి చెప్పిన విధంగా పదికి పది సీట్లు గెలిపించుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం బోనస్, రైత భరోసా వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. కాళ్లు పట్టుకుని పదవులు తీసుకుంది ఎవరో జిల్లా ప్రజలకు తెలుసునని విమర్శించారు. స్వగ్రామంలో వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని మధు మంత్రి పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. దిగజారుడు విమర్శలు చేస్తే జిల్లా ప్రజలు తరిమికొడుతారని హెచ్చరించారు.
“నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. నాలుక చీరేస్తాం అన్న స్థాయికి పరిస్థితులు తీసుకురావద్దు” అని తీవ్ర హెచ్చరిక చేశారు. మంత్రి పొంగులేటి పనితీరు, ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చర్చకు మంత్రి రావాల్సిన అవసరం లేదని, “మేమే వస్తాం… ఎప్పుడు, ఎక్కడ చర్చ చేయాలో డేట్ ఫిక్స్ చేయండి” అంటూ తాతా మధుకు సవాల్ విసిరారు. ప్రజా సమస్యల పై మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని, అభివృద్ధి, ప్రజాసేవ పై చర్చించేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని బేబీ కుమారి స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎందరో అభాగ్యులకు అండగా నిలుస్తుందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు బేడీలు వేసిన వారు రైతుల గూరించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని సీఎం అయ్యాడని దానిని మర్చిపొవద్దన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం, మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు బాణోత్ కిషోర్ నాయక్, సర్పంచ్ బాణోత్ పాపానాయక్, కౌన్సిలర్లు బాణోతు దివ్య, కడవ నవీన్, జిల్లా టెలికాం డైరెక్టర్ రంజిత్ నాయక్, నాయకులు వెంపటి రవి, ముత్యం క్రిష్ణారావు, గునిగంటి సురేష్, రాజేష్, తరుణ్ తదితరులు ఉన్నారు.






