- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం దంపతులు
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తన సతీమణితో కలిసి సోమవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందారు.

దిశ, ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తన సతీమణితో కలిసి సోమవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవాల్లో ఉపముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన వారికి వేద పండితులు, అర్చకులు, ఆలయ అధికారులు వేదమంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భట్టి విక్రమార్క దంపతులు రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన ధార్మిక కార్యక్రమాలను ఉపముఖ్యమంత్రి ఆసక్తిగా వీక్షించి, మహోత్సవాల విశిష్టత గురించి ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. మహా కుంభాభిషేక వేడుకలు భక్తుల గోవింద నామస్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, డీసీసీ ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






