అలాంటి వరుడు కావాలంటూ ప్రకటన విడుదల చేసిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి(Chandini Chaudhary) వరుస సినిమాలు చేస్తూ యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటుంది.

అలాంటి వరుడు కావాలంటూ ప్రకటన విడుదల చేసిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి(Chandini Chaudhary) వరుస సినిమాలు చేస్తూ యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇటీవల ఈ అమ్మడు ‘గామీ’(Gaami) మూవీతో సక్సెస్ అందుకుని అదే ఫామ్‌తో దూసుకుపోతుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రజెంట్ చాందిని నటిస్తున్న తాజా చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirastu). దీనిని సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తుండగా.. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి(Madhura Sreedhar Reddy), నిర్వి హరిప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చాందిని, విక్రాంత్ జంటగా నటిస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Prapthirastu)మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 23న చాందిని చౌదరి(Chandini Chaudhary) పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దాన్ని చాందిని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అయితే అందులో ఏముందంటే.. తన పేరు కల్యాణి ఓరుగంటి(Kalyani Oruganti) అని, వయస్సు 23, తనది వరంగల్ అని ఉంది. అలాగే తనకు ఎటువంటి భర్త కావాలి అన్న విషయాన్ని కూడా పోస్టర్‌లో తెలిపారు. తనకు గవర్నమెంట్ ఉద్యోగి, నో స్మోకింగ్, నో డ్రింకింగ్, పూర్తిగా వెజిటేరియన్ కావాలని ఉంది. ముఖ్యంగా నో టు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అని పోస్టర్‌లో పేర్కొన్నారు. ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా ఐడియా అదుర్స్ అని అంటున్నారు.

Next Story