ఆ హీరోయిన్‌తో టాలీవుడ్ యంగ్ హీరో ఎఫైర్.. రూ. 40 లక్షల కారు గిఫ్ట్

by Dishanational2 |
ఆ హీరోయిన్‌తో టాలీవుడ్ యంగ్ హీరో ఎఫైర్.. రూ. 40 లక్షల కారు గిఫ్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ ఎక్కడ ఎవరితో ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ఇక కలిసి నటించే హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం అనేది సహజం. లవ్ ఎఫైర్స్ అనేవి ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్. ఎంతో మంది హీరోయిన్స్, హీరోలు ప్రేమలో పడుతారు చిన్ని చిన్న మనస్ఫర్దల కారణంగా విడిపోతూ ఉంటారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఓ పెద్ద స్టార్‌గా ఎదగబోతున్న యంగ్ హీరో, పొరుగు రాష్ట్ర హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడంటూ సినీ ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన రూమర్ ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది.

ఇటీవల కాలంలో వారిద్దరు కలిసి ఓ సినిమాలో నటించారని, అప్పటి నుంచే వారిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా వీరు అందరిముందే చనువుగా ఉంటూ, ఆ హీరోయిన్‌కు చాలా గిఫ్ట్స్ కొనిస్తున్నాడని టాక్. ఇటీవలే హీరో ఆమెకు రూ. 40 లక్షల విలువైన ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ హీరోయిన్ హైదరాబాద్‌లో షూటింగ్ ఉన్న సమయంలో ఆ కారును ఉపయోగిస్తున్నట్టు సమాచారం. కానీ సినీ పరిశ్రమలో ప్రేమలు అనేవి చిగురించి, బహుమతులతో మొదలై, ఇద్దరిమధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు, అహంతో విషాదంగా ముగిసిపోతూ ఉంటాయి. అయితే సినీ పరిశ్రమలో హీరో చాలా చిన్నవాడు కావడంతో ఈ ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండమని ఇప్పటికే చాలా మంది అతనికి సలహా ఇస్తున్నారు. కానీ అవేమి పట్టించుకోకుండా వారిద్దరు తమ ప్రేమను కంటిన్యూ చేస్తున్నారు. ఇక వీరి ప్రేమ కథ ఎక్కడి వరకు వెళ్తుందో అంటూ సినీ వర్గాల వారు ముచ్చటిస్తున్నారు.


Next Story