తల్లి అయిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ క్షణాల కోసం ఎంతగానో ఎదురు చూశానంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2024-11-25 16:36:36  IST  )

అదితి శర్మ(Aditi Sharma), ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘గుండె ఝల్లుమంది’(Gunde Jhallumandi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

తల్లి అయిన టాలీవుడ్ హీరోయిన్.. ఈ క్షణాల కోసం ఎంతగానో ఎదురు చూశానంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: అదితి శర్మ(Aditi Sharma), ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘గుండె ఝల్లుమంది’(Gunde Jhallumandi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. కొద్ది కాలం పాటు అదితి సీరియల్స్‌(Serials)లోనూ నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఈ క్రమంలో.. బుల్లితెర నటుటు సర్వర్ అహుజాన్‌(Server Ahujaan)ను ప్రేమించింది. వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరికి ఓ కొడుకు పుట్టాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా, అదితి ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించింది. తనకు కూతురు పుట్టినట్లు వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘నువ్వు ఈ ప్రపంచంలోకి రాకముందు నుంచి నీ కోసం మేమంతా ఎంతగానో ఎదురు చూశాము. నీ చిన్న పాదాలు, పెళుసుగా ఉండే వేళ్లు, మెరిసే కళ్ళు, మీ ఉనికిని అద్భుతంగా భావిస్తున్నాము. ఉత్తమమైన వాటిని అందుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని రాసుకొచ్చింది. అలాగే భర్త, కొడుకుతో తీసుకున్న బేబీ బంప్(Baby bump) ఫొటోలను షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more...

గుడ్ న్యూస్ ప్రకటించిన బుల్లితెర హీరో మానస్.. పోస్ట్ వైరల్

Next Story