- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamannaah: దానికి ఒప్పుకున్న ఫియాన్సీ.. పెళ్లికి రెడీ అయిన మిల్కీ బ్యూటీ
దిశ, వెబ్‌డెస్క్ : మిల్కీ బ్యూటీ అందాల హరివిల్లు తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్ : మిల్కీ బ్యూటీ అందాల హరివిల్లు తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందానికి పెట్టిన పేరు ఆమె. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈ అమ్మడుకు ఉండే క్రేజే వేరు. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. తమన్న త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదివరకు పెళ్లి గురించి టాపిక్ రావడంతో ఇప్పుడు ఆలోచనే లేదు అని తేల్చి చెప్పింది తమన్న. కాగా, ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు తీయడానికి తన కాబోయే వాడు ఒప్పుకున్నట్లు సమాచారం. అందువలన మిల్కీ బ్యూటీ పెళ్లికి రెడీ అయ్యిందని.. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి కూతురు కాబోతుందంటూ సమాచారం. అలాగే త్వరలో తనకు కాబోయే వాడు ఎవరనే విషయాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు వెంకటేశ్ సరసన ఎఫ్3లో నటిస్తున్న విషయం తెలిసిందే.






