- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ హీరోలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్, యువ హీరోలు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో.. హీరో చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నారు.
హీరో చిరంజీవీ తన ట్వీట్‌లో.. "మీ దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నిర్విరామ కృషి అందరికీ మార్గదర్శకం. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి, ప్రజల కోసం మీరు కనే ప్రతి స్వప్నం సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ దృఢ సంకల్పం, ముందుచూపుతో కూడిన ఆలోచనా విధానం ఎల్లప్పుడూ ప్రశంసనీయం. మీరు అభివృద్ధి, పరివర్తన మార్గాన్ని మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నాను.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు మావయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిరంతరం మంచి ఆరోగ్యం, ఆనందంగా ఉండాలని, అదే అంకితభావంతో, దార్శనికతతో మన ప్రజలకు నాయకత్వం వహించి, సేవ చేసేందుకు కావలసిన శక్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నాము. మీ నాయకత్వం రాష్ట్రానికి పురోగతిని, శ్రేయస్సును, గర్వకారణంగా నిరంతరం స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాము" అని రాసుకొచ్చారు.
హీరో రామ్ చరణ్ తన ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యం, ఆనందం తో పాటు మరెన్నో సంవత్సరాల పాటు అంకితభావంతో సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాము" అని రాసుకొచ్చారు.
అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన ట్వీట్‌లో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడుకి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
రాష్ట్రంలో ఎవరూ పస్తులుండొద్దు.. ఎమోషనల్ అయిన సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు పుట్టిన రోజు.. స్పెషల్ విషెస్ చెబుతూ ప్రధాని మోడీ ట్వీట్






