- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఎవరూ పస్తులుండొద్దు.. ఎమోషనల్ అయిన సీఎం చంద్రబాబు
అన్నదానం ప్రజా ఉద్యమం కావాలని పుట్టిన రోజు వేళ సీఎం చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తినడానికి తిండి లేదని ఎవరూ బాధపడొద్దని, ఎవరూ పస్తుంలుడొద్దని సీఎం చంద్రబాబు (CM Chandrababu) భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ విజయవాడలోని పటమట హైస్కూల్ వద్ద తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఆయన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. త్వరలో మరో 5 క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.
అన్నదానంలో భువనేశ్వరి (Bhuvaneshwari)ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు అన్నదానం చేసేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరుపేదలెవరూ తినడానికి తిండి లేదని బాధపడొద్దని, అందుకోసమే అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇది కేవలం అన్నదానం మాత్రమే కాదని.. పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






