వరంగల్‌కు రానున్న పవన్ కళ్యాణ్

by Muthe.Rajitha |

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.

వరంగల్‌కు రానున్న పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. తన వీరాభిమాని నిరంజన్‌ను పరామర్శించేందుకు ఆయన ఈ ప్రత్యేక పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇందులో భాగంగా రేపు ఉదయం 7:30 గంటలకే హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన వరంగల్‌కు బయలుదేరుతారు. వరంగల్ చేరుకున్న అనంతరం ఉదయం 9:45 గంటల నుంచి 10:30 గంటల వరకు నిరంజన్ నివాసంలోనే పవన్ గడుపుతారు. తన అభిమానిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో నిరంజన్ కుటుంబ సభ్యులను కలిసేందుకు స్థానిక జనసేన నాయకులు, యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ పరామర్శ కార్యక్రమం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ వరంగల్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు పయనం కానున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ వరంగల్‌కు వస్తుండటంతో, ఆయన పర్యటన సాగే మార్గంలో పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జనసేనాని రాకను పురస్కరించుకుని స్థానిక అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. వస్తుండటంతో, ఆయన పర్యటన సాగే మార్గంలో పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Next Story