రూట్ మారుస్తున్న టాలీవుడ్ హీరోలు.. సీనియర్లు అలా యంగ్ హీరోలు ఇలా..

by Dishafeatures2 |
రూట్ మారుస్తున్న టాలీవుడ్ హీరోలు.. సీనియర్లు అలా యంగ్ హీరోలు ఇలా..
X

దిశ వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్‌వైపే ప్రపంచ సినీ పరిశ్రమ కళ్లున్నాయి. సరికొత్త కథలు, అదిరిపోయే స్క్రీన్ ప్లే, నటనతో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. బాహుబలి సినిమాతో మొదలైన టాలీవుడ్ పరంపర రోజురోజుకు పుంజుకుంటోంది. ప్రతి హీరో నెవ్వర్ బిఫోర్ అనే పాత్రలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోలు అంతా కూడా తమ రూట్ మార్చే పనిలో పడ్డారు. నేచురల్ స్టార్ నాని కూడా 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో బెంగాలీ బాబుగా అందరినీ ఔరా అనిపించాడు. పవర్ ఫుల్ రైటర్‌గా, శ్యామ్ సింగరాయ్‌గా నాని అదరగొట్టాడు.

ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రేక్షకుల ఊహలకు అందకుండా బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కనున్న 'దసరా' సినిమాను ఓకే చేశాడు. అంతేకాకుండా ఇందులో డీగ్లామర్ పాత్రలో కనిపించేందుకు రెడీ అయిపోయాడు. నానితో పాటు టాలీవుడ్ చాక్లెట్ బాయ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా తన స్టైల్ మార్చేస్తున్నాడు. ఇన్నాళ్లు లవర్ బాయ్, చాక్లెట్ బాయ్‌గా ఫుల్ ఎనర్జీతో అందరినీ కట్టిపడేసిన రామ్. ఇప్పుడు చాక్లెట్ బాయ్ నుంచి చాకులాంటి అబ్బాయిగా మారేందుకు రెడీ అవుతున్నాడు. రామ్ అప్‌కమింగ్ మూవీ 'ది వారియర్'లో పక్కా మాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

మెగా మేనల్లుడు వరుణ్ తేజ్ కూడా ఇదే రూట్‌ల నడుస్తున్నాడు. లవర్ బాయ్‌గా ఎంట్రి ఇచ్చిన వరుణ్ ప్రస్తుతం యాక్షన్ హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగానే తన అప్‌కమింగ్ మూవీ 'గని'లో పవర్ ఫుల్ పంచెస్ విసిరేందుకు కసరత్తులు చేస్తున్నాడు. సీనియర్ హీరోలంతా పాన్ ఇండియాకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటే. కుర్ర హీరోలంతా టాలీవుడ్‌ను ఏలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి వీరి జాబితాలో ఇంకెంతమంది యువ హీరోలు చేరతారో చూడాలి.


Next Story