- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's horoscope(May 21): నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం!
గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఇవాళ(మే 21, గురువారం) గ్రహాల సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ధనలాభాలు ఉంటే, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం గురువారం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ఆర్థిక లాభాలు బాగుంటాయి. ఆర్థికంగా ఏ లోటు ఉండదు. మొండి బాకీలు వసూలవుతాయి. అయితే ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనవసర వివాదాలు, డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
వృషభ రాశి: ఇవాళ ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వచ్చి భారీ లాభాలు దక్కుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. తొందరపాటు మాటలు తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంతో గడపడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అదృష్ట యోగం కనిపిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. గురు బలం వల్ల మీకు ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు కలిసివస్తాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు అనుకూల సమయం.
కర్కాటక రాశి: ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి పెరుగుతాయి. బకాయిలు వసూలవుతాయి. వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వ్యాపారంలో ఆదాయం పెరిగిన, పెట్టుబడుల విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
సింహ రాశి: ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే పనులలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్య రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. భూములు లేదా వాహనాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. రహస్య శత్రువుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
తుల రాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు చకచకా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆత్మీయుల మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చిక రాశి: ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులు, కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దవారితో మాట్లాడే ముందు అచూతూచి మాట్లాడండి. లేకపోతే చిక్కుల్లో పడే ప్రమాదముంది. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. యోగ, ధ్యానం వంటివి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దేవాలయాలకు వెళ్లడం వల్ల ప్రశాంతతను పొందుతారు.
మకర రాశి: అప్రయత్న కార్యసిద్ధి, ఆకస్మిక ధనలబ్ధి చేకూరుతాయి. కొత్త పరిచయాలు వ్యాపార వృద్ధికి తోడ్పడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు అవసరం. ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు టెంపుల్‌కి వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
కుంభ రాశి: ఆర్థిక పరిస్థితి బాగున్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు ఉంటే పరిష్కారమవుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజు. ఇంట బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
మీన రాశి: ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన నిర్ణయాలు మార్చుకోవాల్సి రావచ్చు. దూర ప్రయాణాలు ఒత్తిడి కలిగిస్తాయి. దైవదర్శనాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇష్టదైవారాధన చేయడం వల్ల అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు.






