Today's Horoscope:ఈ రోజు(14-07-2026) రాశి ఫలాలు

by Jakkula.Mamatha |

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈరోజు(జులై 14) మంగళవారం రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Todays Horoscope:ఈ రోజు(14-07-2026) రాశి ఫలాలు
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈరోజు(జులై 14) మంగళవారం రాశి చక్రములోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం..

మేష రాశి

ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్టం కలిసివస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసివచ్చే రోజు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో స్వల్ప శ్రద్ధ వహించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజంతా ఉత్సాహంగా సాగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలవుతాయి. నూతన ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం సంతోషాన్నిస్తుంది.

కర్కాటక రాశి

ఈ రాశి వారు ఇవాళ వృత్తి, ఉద్యోగాల్లో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ రీత్యా అనుకూల మార్పులు ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది.

సింహ రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనుల్లో కొంత విలంబన జరిగినప్పటికీ, ఆఖరి నిమిషంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి.

కన్య రాశి

ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసివస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

తుల రాశి

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన పనులను ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈ రోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు లేదా వివాదాస్పద విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు వేగవంతం చేస్తారు.

ధనస్సు రాశి

పిల్లల విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆందోళన తగ్గించుకోవడానికి ధ్యానం లేదా దైవచింతన మేలు చేస్తుంది.

మకర రాశి

ఈ రాశి వారు భూమి, వాహన రంగానికి చెందిన వారికి అనుకూలమైన రోజు. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. శ్రమ ఎక్కువైనా తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా పరవాలేదనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

కుంభ రాశి

మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. సహోద్యోగులు, సోదరుల మద్దతు లభిస్తుంది. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి చాలా మంచి రోజు. మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి లేదా సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ధన యోగం ఉంది. బకాయిలు వసూలవుతాయి, పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. భోజనం విషయంలో సమయపాలన పాటించడం మంచిది.

Next Story