- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
E20 ఎఫెక్ట్.. భారీగా పెరిగిన చెరుకు సాగు
భారతదేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన E20 - పెట్రోల్ విధానం దేశీయ వ్యవసాయ రంగాన్ని ఊహించని రీతిలో మలుపు తిప్పితోంది.

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన E20 - పెట్రోల్ విధానం దేశీయ వ్యవసాయ రంగాన్ని ఊహించని రీతిలో మలుపు తిప్పితోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ముడి చమురు దిగుమతులను తగ్గించుకునే వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 20 శాతం ఎథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించింది. కాగా, ప్రస్తుత 2026 సంవత్సరం నుండి ఈ E20 ఇంధన విధానాన్ని దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తుండటంతో ఎథనాల్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇది దేశంలో చెరుకు, మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణమైంది. ఎథనాల్ తయారీకి అవసరమైన ఫీడ్‌స్టాక్ సాగు విస్తీర్ణం గత ఐదేళ్లలో కళ్లు చెదిరే రీతిలో వృద్ధి చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం 0.7 మిలియన్ హెక్టార్లుగా ఉన్న ఎథనాల్ ఫీడ్‌స్టాక్ సాగు విస్తీర్ణం, 2024-25 నాటికి ఏకంగా 56.7 లక్షల హెక్టార్లకు చేరుకుంది.
అంటే కేవలం ఐదేళ్లలోనే సాగు విస్తీర్ణం దాదాపు 8 రెట్లు పెరగడం గమనార్హం. ఇక ఈ ఏడాది జులై 10 నాటికి అది 57.5 లక్షల హెక్టార్లకు చేరుకోవడం విశేషం. ఇందులో చెరుకు ఆధారిత ఎథనాల్ ఉత్పత్తి అత్యంత కీలక పాత్ర పోషించింది. ఎథనాల్ కొనుగోళ్లకు ప్రభుత్వం నుండి లభిస్తున్న మద్దతుతో చక్కెర మిల్లుల ఆదాయం పెరగడమే కాకుండా, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగి అదనపు ఆదాయం సమకూరింది. దీంతో దేశవ్యాప్తంగా రైతులు చెరుకు సాగు వైపు విపరీతంగా మొగ్గు చూపారు. అయితే, చెరుకు సాగుకు విపరీతంగా నీటి వినియోగం అవసరమవుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






