ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ

by Jakkula.Mamatha |

పెద్దపల్లి జిల్లాలో మరో లంచగొండి అధికారి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కాడు.

ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ
X

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో మరో లంచగొండి అధికారి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం దాడులు జరిగాయి. పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన వర్క్ బిల్లు కోసం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story