పచ్చటి పైరుకు ఎర్రటి రోగం.. నిజాంపేటలో రైతులకు చేదు అనుభవం

by Jakkula.Mamatha |

పచ్చటి పైరుకు ఎర్రటి రోగం తగులుతుంది.

పచ్చటి పైరుకు ఎర్రటి రోగం.. నిజాంపేటలో రైతులకు చేదు అనుభవం
X

దిశ, నిజాంపేట: పచ్చటి పైరుకు ఎర్రటి రోగం తగులుతుంది. ఈ వర్షాకాలం ఆశతో పంట సాగులో.. నిమగ్నమయ్యే రైతన్నకు చేదు అనుభవం ఏర్పడుతుంది. నిజాంపేట మండల వ్యాప్తంగా వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. భూ గర్భ జలాలు తగ్గడం వల్ల పంట పొలాల్లో బోర్ మోటార్ల నీరు తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు కరెంట్ కష్టాలు సైతం వెంటాడుతున్నాయనీ వాపోతున్నారు. కరెంట్ సరఫరా లో.. అంతరాయం వల్ల పంటపొలాల్లో సాగు తగ్గిపోయింది. వేసిన తూకాలకు ఎర్రటి రోగం పడుతుంది. నిజాంపేట లో సుమారు 10 వేల ఎకరాల్లో వరి సాగు, 625 ఎకరాల్లో మొక్కజొన్న వివిధ స్వల్ప కాల పంటలను సాగు చేస్తున్నారు.

ఇప్పటి వరకు 10 వేల ఎకరాల్లో.. వరి సాగుకు కావాల్సిన నారు వేసుకోవడం జరిగిందని, పొడి వాతావరణం కారణంగా ఎదుగుదల మందలించడం జరుగుతుందని, కొన్ని నారుమళ్లలో.. జింక్ లోపం వల్ల నారు ఎర్రబడడం గమనించడం జరిగిందని, జింక్ లోపల నివారణకు చిలేటెడ్ జింక్, కార్బెండిజం పిచ్ కారి చేయాలన్నారు. వర్షాలు తక్కువ ఉండడం వల్ల స్వల్పకాల పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించడం జరుగుతుందని ఏవో సోమలింగ రెడ్డి అన్నారు.

Next Story