తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. జూలై 16 నుండి 19 వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. జూలై 16 నుండి 19 వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. నేడు రాష్ట్రంలో హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుందని ఎండగా పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. రేపటి నుండి రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం మరింత తగ్గుతుందని జూలై 15 నుండి ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. జూలై 16 నుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లోనూ విస్తారంగా కురుస్తాయని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న వేడి ఉష్ణోగ్రతల నుండి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఈ ఏడాది సరిగ్గా వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Next Story