- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరెస్టులతో చలో సచివాలయాన్ని అడ్డుకోలేరు:సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు
అరెస్టులతో ఛలో సచివాలయాన్ని కార్యక్రమాన్ని అడ్డుకోలేరని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దిన్‌కార్ అన్నారు.

దిశ, ఆసిఫాబాద్: అరెస్టులతో ఛలో సచివాలయాన్ని కార్యక్రమాన్ని అడ్డుకోలేరని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దిన్‌కార్ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో జరిగే ఛలో సచివాలయం కార్యక్రమం నేపథ్యంలో సీపీఎం జిల్లా ముఖ్యనేతలను సోమవారం రాత్రి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి.. వాంకిడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఛలో సచివాలయాన్ని వెళ్లనివ్వకుండా ప్రభుత్వం తమను పోలీసులతో అడ్డుకొని, అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా సర్కార్ అణచివేతకు పాల్పడటం అప్రజాస్వామికం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్‌ల్లో సదుపాయాలు, మెస్ బిల్లులు చెల్లించాలని, విద్యా రవాణా ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా విధానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.






