మహిళలు పోషించడానికే పుట్టారు, వంట నేర్చుకోండి.. గవర్నర్ వ్యాఖ్యలకు కంగనా సపోర్ట్

by Ajay Maddhiboyina |

మ‌హిళ‌లు త‌మ కుటుంబాల కోసం వంట చేయ‌డం నేర్చుకోవాల‌ని యూపీ గ‌వ‌ర్న‌ర్ ఆనందీ బెన్ ప‌టేల్ చేసిన వ్యాఖ్య‌ల‌కు బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ స‌పోర్ట్ చేశారు. ఇటీవ‌ల కాన్పూర్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆనందీ బెన్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి.

మహిళలు పోషించడానికే పుట్టారు, వంట నేర్చుకోండి.. గవర్నర్ వ్యాఖ్యలకు కంగనా సపోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మ‌హిళ‌లు త‌మ కుటుంబాల కోసం వంట చేయ‌డం నేర్చుకోవాల‌ని యూపీ గ‌వ‌ర్న‌ర్ ఆనందీ బెన్ ప‌టేల్ చేసిన వ్యాఖ్య‌ల‌కు బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ స‌పోర్ట్ చేశారు. ఇటీవ‌ల కాన్పూర్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆనందీ బెన్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. ఆనందీ త‌న ప్ర‌సంగంలో.. మీరు టీచ‌ర్ అయినా, ఐఏఎస్ అయినా నేటి మ‌హిళ‌ల‌లు త‌మ కుటుంబాల కోసం వంట చేయ‌డం నేర్చుకోవాలి. మీరు ముందుగా మంచి త‌ల్లిగా మారాలి. ఒక త‌ల్లి క‌ర్త‌వ్యం ఏంటి? త‌న కుమార్తెకు అన్ని విధాల శిక్ష‌ణ ఇవ్వ‌డం. ఆమె త‌న అత్త‌గారి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన‌వ‌ద్దు. స‌మ‌స్య‌లు వ‌చ్చినా సొంతంగా ఎదుర్కోవాలి. మ‌నం ఆ శ‌క్తిని కుమార్తెల‌కు ఇవ్వాలి. అంటూ మాట్లాడారు. గ‌వ‌ర్న‌ర్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై కొంత‌మంది విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌హిళ‌లు వంటింటికే ప‌రిమితం అవ్వాలా అంటూ మండిప‌డుతున్నారు.

ఇక ఈ వ్యాఖ్య‌ల‌పై కంగనా సోష‌ల్ మీడియాలో స్పందించారు. పిల్ల‌ల‌ను పెంచ‌డం మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే వ‌స్తుంద‌ని కంగ‌నా పేర్కొన్నారు. త‌న చిన్న వ‌య‌సులో సోద‌రుడు క్రికెట్, ఫుట్ బాల్ ఆడేవాడ‌ని ఆనీ తాను ఇంట్లో అంద‌రినీ అల‌రిస్తూ జాగ్ర‌త్త‌గా బొమ్మ‌ల ఇళ్లు క‌ట్టేదాన్ని అని చెప్పారు. బొమ్మ‌ల‌కు దుస్తులు కుట్ట‌డం, వాటికి వంట చేయ‌డం లాంటివి చేసేదాన‌ని తెలిపారు. బొమ్మ‌ల‌కు అమ్మ‌లా న‌టించేదాన్ని అని పేర్కొన్నారు. ఇవి మ‌నం నేర్చుకోవాల్సిన విష‌యాలు కాద‌ని, మాన‌వాళిని పోషించే శ‌క్తిని భ‌గ‌వంతుడు మ‌న‌కు ప్ర‌సాదించాడ‌ని అన్నారు. అది మ‌న స‌హ‌జ స్వ‌భావమ‌ని, అందుకే స్త్రీల‌ను దేవి, శ‌క్తి, అన్న‌పూర్ణ‌మాత ఇలా అనేక రూపాల‌తో పిలుస్తార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

కానీ వీట‌న్నింటికంటే ప్రేమించ‌డం, తినిపించ‌డం, డ్యాన్స్ చేయ‌డం, పోషించ‌డం ఎంతో ఆనందాన్ని ఇస్తుంద‌ని పేర్కొన్నారు. అయితే గతంలో కంగ‌నా రనౌత్ క్వీన్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో కంగ‌నా పోషించిన పాత్ర‌కు పూర్తి వ్య‌తిరేకంగా ఆమె ప్ర‌స్తుతం మాట్లాడారు. అంతే కాకుండా త్వ‌ర‌లోనే క్వీన్ 2 సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇలాంటి స‌మయంలో కంగ‌నా చేసిన కామెంట్స్ కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story