- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: ఎస్ఎఫ్ఐ
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలను అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ అన్నారు.

దిశ, చేవెళ్ల: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలను అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి వెళ్లకుండా తనను తెల్లవారుజామునే ముందస్తుగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్బంధ రాజకీయాలను వీడి విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ మరింత బలంగా ఉద్యమిస్తుందని, ఎలాంటి బెదిరింపులు, అక్రమ అరెస్టులకు భయపడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఈయూ డివిజన్ నాయకులు జైపాల్, ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ సహాయ కార్యదర్శి మణి గౌడ్, చేవెళ్ల మండల కార్యదర్శి మాల చందు తదితరులు పాల్గొన్నారు.






