మరోసారి భారత్‌లోకి అమెరికా మాజీ సైనికుని చొరబాటు

by Muthe.Rajitha |

భారత్ సరిహద్దుల్లోకి సరైన పత్రాలు లేకుండా చొరబడుతున్న అమెరికా మాజీ సైనికుణ్ణి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

మరోసారి భారత్‌లోకి అమెరికా మాజీ సైనికుని చొరబాటు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ సరిహద్దుల్లోకి సరైన పత్రాలు లేకుండా చొరబడుతున్న అమెరికా మాజీ సైనికుణ్ణి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత్-నేపాల్ సరిహద్దులో వెంబడి అనుమానాస్పదంగా సంచరిస్తూ, ఎటువంటి ప్రయాణ పత్రాలు (Travel Documents) లేకుండా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఒక అమెరికా మాజీ సైనికుడిని సశస్త్ర సీమా బల్ (SSB) బలగాలు అరెస్ట్ చేసాయి. కాగా ఇటీవలే మణిపూర్ సరిహద్దుల్లో అమెరికాకు చెందిన ప్రముఖ డ్రోన్ నిపుణుడు మాథ్యూ వాన్‌డైక్‌ను భారత సైన్యం అరెస్ట్ చేసిన ఘటన మరవక ముందే.. తాజాగా మరో అమెరికా రిటైర్డ్ సోల్జర్ పట్టుబడటం భారత రక్షణ, నిఘా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదుపులోకి తీసుకున్న అమెరికా మాజీ సైనికుడిని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన జోర్డాన్‌ బ్రౌన్‌గా గుర్తించారు. సరిహద్దు దాటేందుకు యత్నిస్తున్న సమయంలో జోర్డాన్‌ను ఎస్‌ఎస్‌బీ జవాన్లు గమనించి ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అయితే, అధికారుల నుండి తప్పించుకునేందుకు అతడు ఒక్కసారిగా అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. జవాన్లు అతడిని అడ్డుకునే లోపే సరిహద్దు సమీప గ్రామంలోకి పరుగెత్తిన జోర్డాన్‌ను స్థానిక ప్రజలు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. వెంటనే అతడిని తిరిగి సరిహద్దు భద్రతా సిబ్బందికి అప్పగించారు.

సరైన వీసా, పాస్‌పోర్ట్ వంటి పత్రాలు లేకుండా అతడు భారత్ నుండి నేపాల్‌కు ఎందుకు వెళ్లాలని ప్రయత్నించాడనే కోణంలో ఎస్‌ఎస్‌బీ అధికారులు కేంద్ర నిఘా వర్గాలతో కలిసి ఉమ్మడి దర్యాప్తును ప్రారంభించారు. చైనా సరిహద్దులకు ఆనుకుని ఉండే నేపాల్‌ కారిడార్‌లో వరుసగా అమెరికా పౌరులు అనుమానాస్పదంగా దొరకడం వెనుక ఏవైనా వ్యూహాత్మక ప్రణాళికలు ఉన్నాయా అనే దిశగా విచారణ జరుపుతున్నారు. అయితే అధికారుల ప్రాథమిక విచారణ సమాచారం ప్రకారం.. తాను 2024లో భారత్ కు చెందిన మహిళను ఇటలీలో పెళ్లి చేసుకొని 2025లో గోవాకు వచ్చినట్టు, ఇటీవల థాయిలాండ్ పర్యటనకు వెళ్లగా పాస్పోర్ట్ పోగొట్టుకున్నానని అధికారులకు తెలిపినట్టు తెలుస్తోంది.

Next Story