ఏపీలో దారుణం.. క్షుద్రపూజలకు చిన్నారి బలి

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళ వైకల్యం కలిగిన బాాలుడిని బలి తీసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. వైకల్యంతో బాధపడుతున్న చిన్నారిని నడిపిస్తానంటూ మొబీనా అనే మహిళ అతడి కుటుంబాన్ని నమ్మించింది.

ఏపీలో దారుణం.. క్షుద్రపూజలకు చిన్నారి బలి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళ వైకల్యం కలిగిన బాాలుడిని బలి తీసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. వైకల్యంతో బాధపడుతున్న చిన్నారిని నడిపిస్తానంటూ మొబీనా అనే మహిళ అతడి కుటుంబాన్ని నమ్మించింది. దీంతో వైకల్యం పోతుందేమో అని నమ్మిన తల్లిదండ్రులు పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం బాలుడి రెండు చేతులను తాళ్లతో కట్టేసిన మొబీనా అతడిని కొడుతూ చిత్రహింసలు పెట్టింది. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక బాలుడు ప్రాణాలు విడిచాడు.

బాలుడిని చిత్ర హింసలు పెట్టిన చోట రక్తం మరకలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పూజలు చేసిన ప్రదేశంలో రక్తం, నిమ్మకాయలు, కోడిగుడ్లు, గాజులు కనిపిస్తున్నాయి. ఎర్రచీర కట్టుకుని ఆమె ఈ పూజలు చేసింది. చనిపోయిన తరవాత కూడా బ్రతికిస్తాను అంటూ మొబీనా పూజలు కొనసాగించింది. చివరికి ఆమె తీరుపై అనుమానం రావడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని పొట్టనపెట్టుకోవడంతో మొబీనాపై అతడి బంధువులు దాడి చేశారు.

Next Story