- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ నష్టాల్లో మార్కెట్లు
హార్మోజ్ జలసంధిలో పెరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : హార్మోజ్ జలసంధిలో పెరుగుతున్న దాడులు, పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని దిగ్బంధిస్తున్నామని, అక్కడ టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేయడంతో అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ పరిణామాలు భారతీయ మార్కెట్లను తీవ్ర ప్రతికూలతల్లోకి నెట్టడంతో మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుండే సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
కుప్పకూలిన ట్రేడ్ మార్కెట్లు
ఈ అంతర్జాతీయ భయాందోళనల నేపథ్యంలో.. మంగళవారం ఉదయం మార్కెట్ల ప్రారంభ సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) 412 పాయింట్లు కుప్పకూలి 77,203 వద్ద ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) కూడా 107 పాయింట్లు నష్టపోయి 24,103 వద్ద కదలాడుతోంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశీయ రంగాలైన పెయింట్స్, ఏవియేషన్, టైర్స్ మరియు ఆటోమొబైల్ రంగానికి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
రూపాయి మరోసారి ఢమాల్
మరోవైపు మార్కెట్ల పతనానికి తోడు దేశీయ కరెన్సీ రూపాయి విలువ కూడా భారీగా క్షీణించింది. అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్ పెరగడం, చమురు ధరల ఒత్తిడితో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 42 పైసలు పడిపోయి 96.10 వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి కుంగిపోయింది. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ముదిరితే రానున్న రోజుల్లో మార్కెట్లు మరిన్ని ఒడుదొడుకులను ఎదుర్కోవాల్సి వస్తుందని మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






