- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాకా’ సినిమాలో నైలా .. నా బలమైన కోరిక వల్లే పదకొండేళ్ల కల నెరవేరిందంటూ ఎమోషనల్ కామెంట్స్
అట్లీ దర్శకత్వంలో నటించాలనే తన పదకొండేళ్ల కల నెరవేరిందని, ఇది కేవలం తన మనసులోని బలమైన కోరిక వల్లే సాధ్యమైందని తెలిపారు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ దర్శకుడు అట్లీ కాంబోలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ ‘రాకా’. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటి ఫెమినా జార్ట్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాలో నైలా గ్రేవాల్ జాయిన్ అయినట్లు ఆమె కన్ఫార్మ్ చేశారు. పాపులర్ వెబ్ సిరీస్ ‘మామ్లా లీగల్ హై’ సీజన్2తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆమె భారీ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుబోతుండటం విశేషం. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో భాగంగా నైలా స్పందిస్తూ.. తన కెరీర్‌లో మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ అయిన ‘రాకా’ సినిమాలో భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అట్లీ దర్శకత్వంలో నటించాలనే తన పదకొండేళ్ల కల నెరవేరిందని, ఇది కేవలం తన మనసులోని బలమైన కోరిక వల్లే సాధ్యమైందని తెలిపారు.
తొలి సమావేశంలోనే తాను అట్లీ పనితీరును ఎంతగానో అభినందించానని, కేవలం హిందీ చిత్ర పరిశ్రమలోనే పనిచేసిన తనలాంటి నటితో కొలాబరేట్ అవ్వడానికి ఆయన ఎంతో హుందాగా అంగీకరించారని నైలా చెప్పారు. అట్లీ సినిమా మేకింగ్ ఒక మాస్టర్‌క్లాస్ లాంటిదని, అంత పెద్ద చిత్రాన్ని తెరకెక్కించడానికి ఆయన చూపే అంకితభావం, పట్టుదల తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తున్న అల్లు అర్జున్, దీపికా పదుకొణెలతో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై నైలా స్పందిస్తూ.. ‘రాకా’లో ఆమెతో కలిసి నటించడం ఒక మరుపురాని అనుభూతిని ఇచ్చిందని అన్నారు. దీపికా తన స్టార్‌డమ్ కంటే కూడా పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ప్రశంసించారు. ఇక అల్లు అర్జున్ గురించి చెబుతూ.. ఆయన ఇప్పటికే ఎంతో స్టార్‌డమ్ తెచ్చుకున్నప్పటికీ, ప్రతి సీన్ పర్ఫెక్ట్‌గా వచ్చేంతవరకు ఆయన చూపే శ్రద్ధ, కసి తనలాంటి కొత్త నటులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఇక ‘రాకా’ సినిమా గురించి చెబుతూ.. "ఈ చిత్రం సాధారణ సినిమాలకు భిన్నంగా, సరికొత్త పంథాలో ఉండబోతోంది. మేకింగ్ పరంగా, క్యారెక్టర్ల డిజైన్ పరంగా సినిమా సరిహద్దులను దాటి సరికొత్త అనుభూతిని ఇస్తుంది" అని నైలా పేర్కొన్నారు.






