- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండెపోటుతో సీపీఐ మండల కార్యదర్శి మృతి
by Jakkula.Mamatha |
బాల్యం నుంచి నమ్మిన కమ్యూనిస్టు సిద్దాంతానికి కట్టుబడి విలువలతో ఎర్ర జెండా నీడలో పయనిస్తూ కొనసాగుతూ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై నిద్రలోనే ప్రాణాలు విడిచాడు సీపీఐ మండల కార్యదర్శి బొల్లెద్దుల శ్రీనివాసులు(40).

X
దిశ, పెద్దకొత్తపల్లి: బాల్యం నుంచి నమ్మిన కమ్యూనిస్టు సిద్దాంతానికి కట్టుబడి విలువలతో ఎర్ర జెండా నీడలో పయనిస్తూ కొనసాగుతూ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై నిద్రలోనే ప్రాణాలు విడిచాడు సీపీఐ మండల కార్యదర్శి బొల్లెద్దుల శ్రీనివాసులు(40). పెద్ద కొత్తపల్లి మండలం దేవుని తిర్మాలాపూర్ గ్రామానికి చెందిన ఆయన మండల సీపీఐ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈయనకు భార్య ఉంది. కాకలు తీరిన కమ్యూనిస్టు పార్టీ వృద్ధ నాయకులు జి.ఉస్సేనయ్య స్వయాన శ్రీనివాస్ మేనమామ. విద్యార్థి దశ నుంచే శ్రీనివాస్ తన మేనమామ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సీపీఐ మండల నేతగా ఎదిగారు. యువ కమ్యూనిస్టు నేత బొల్లీద్దుల శ్రీనివాసులు మృతి పట్ల పలు రాజకీయ పార్టీలు, సీపీఐ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
Next Story






