- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరవాడ ఫార్మాసిటీలో మరోప్రమాదం.. లోహిత ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్
అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న లోహిత ఫార్మా కంపెనీలో అకస్మాత్తుగా విషవాయువులు లీకయ్యాయి. ఈ ఘటనలో కంపెనీలో కెమిస్ట్ గా పనిచేస్తున్న తాళ్ల దుర్గారావు అనే ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తోటి ఉద్యోగులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యాన్ని విచారించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కాగా.. పరవాడ ఫార్మాసిటీలోనే నిన్న (సోమవారం) ఒక ప్రమాదం జరిగింది. టోరెంటో ఫార్మా కంపెనీలో నైట్ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై కెమికల్ పడింది. ఈ ప్రమాదంపై ఎన్. నాగరాజు (36) అనే ఉద్యోగి తీవ్రంగా గాయపడగా.. ఆయన ప్రస్తుతం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎడమచేతితోపాటు.. ఎడమ కంటికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలపై కార్మిక లోకం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ తీర్మానం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






