- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘టైటానిక్’ లాంటి గాఢమైన లవ్ స్టోరీ డైరెక్ట్ చేస్తా.. ఊర్వశి రౌతేలా షాకింగ్ కామెంట్స్
తనకు పాటలు పాడటం, డైరెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టమని, ఖచ్చితంగా మెగాఫోన్ పడతానని స్పష్టం చేశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కేవలం హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా, తెలుగు సినిమాల్లోనూ నటించి ఇక్కడి ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తన అద్భుతమైన గ్లామర్‌తో కుర్రకారును మంత్రముగ్దులను చేయడంలో ఈ భామ ఎప్పుడూ ముందుంటారు. గతేడాది నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన 'డాకు మహారాజు' చిత్రంలో నటించిన ఊర్వశి, తన ఖాతాలో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ను వేసుకున్నారు. ఈ సినిమా విజయంతో తెలుగు ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఒకవైపు వరుస చిత్రాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలను పంచుకుంటూ నెట్టింట రచ్చ లేపుతుంటారు. ఊర్వశి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా, ఏ విషయం మాట్లాడినా అది కొద్ది నిమిషాల్లోనే ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నటిగా గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతున్న ఊర్వశి కేవలం యాక్టింగ్‌తోనే ఆగిపోలేదు. ఆమెకు ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది.
ఒకవైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు నిర్మాతగా కూడా మారి సరికొత్త ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తూ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా దూసుకుపోతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తాను కొంచెం బిజీగా ఉండటం వల్లే ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. అలాగే తనకు పాటలు పాడటం, డైరెక్షన్ చేయడం అంటే చాలా ఇష్టమని, ఖచ్చితంగా మెగాఫోన్ పడతానని స్పష్టం చేశారు. తాను చాలా ఎమోషనల్ పర్సన్ కాబట్టి, తన మొదటి సినిమాగా 'టైటానిక్' లాంటి గాఢమైన ప్రేమకథను తెరకెక్కించడమే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. ఊర్వశి మాట్లాడిన ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తుంటే, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. చేతిలో ఒక జార్ పట్టుకుని ఇంటర్వ్యూ ఇస్తున్న మొదటి నటి ఈమెనే అంటూ కొందరు ఎగతాళి చేయగా, ఆమె తీసే సినిమాకు 'ట్రై పానిక్' అని పేరు పెట్టాలంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.






