- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్యూమరేషన్ ఫారాలు త్వరగా సమర్పించాలి:ఆర్డీవో సరిత
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్‌డీఓ నియోజకవర్గ ప్రజలకు మంగళవారం విజ్ఞప్తి చేశారు.

దిశ,షాద్ నగర్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆర్‌డీఓ నియోజకవర్గ ప్రజలకు మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అర్హులైన ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజలు తమకు అందిన ఫారాలను పూర్తిగా, స్పష్టంగా నింపి తమ పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్ కు లేదా సంబంధిత మండల తహశీల్దార్‌కు అందజేయాలని కోరారు.
షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఓటర్లు తమ ఫారాలను మున్సిపల్ అధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రజలు సమర్పించిన ఫారాలను అధికారులు బీఎల్‌ఓ యాప్ తో ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉన్నందున, గడువు ముగిసేలోపు వీలైనంత త్వరగా ఫారాలను సమర్పించి ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని ఈఆర్‌ఓ కోరారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ఓటర్ల జాబితాలో పేరు ఉండేలా చూసుకోవాలని ఆర్డీవో సరిత పేర్కొన్నారు.






