- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోతంశెట్టిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. దారిలోంచి ఆటో తీయమన్నందుకు తండ్రీకొడుకుల పై దాడి!
పోతంశెట్టిపల్లి చౌరస్తాలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ,కొల్చారం: పోతంశెట్టిపల్లి చౌరస్తాలో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోతంశెట్టిపల్లి చౌరస్తా సమీపంలో నివాసముండే రమేష్ గౌడ్ అతని కుమారుడు బబ్లు(రేవంత్ గౌడ్)లు తమ ఇంటికి వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా ఆటో నిలిపి ఉండడంతో తమ వాహనం వెళ్లేందుకు వీలు కాకపోవడంతో ఆటోను రోడ్డు పై నుండి తీయాలని అనడంతో రోడ్డుపై ఆటో నిలిపిన గ్రామానికి చెందిన రషీద్ అతని అల్లుడు ఆరిఫ్‌లు ఒక్కసారిగా ఇనుప రాడ్డులతో రమేష్ గౌడ్ బబ్లులపై దాడికి దిగారు.
విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడికి చేరుకొని గొడవ నిలువరించే ప్రయత్నం చేయగా గ్రామస్తులపై సైతం దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో రమేష్ గౌడ్ బబ్లులతోపాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోగా రషీద్ ఆరిఫ్ లు అక్కడి నుంచి పరారయ్యారు. కొల్చారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.






