- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదొక అరుదైన సినిమా మూడు గంటలు కేటాయించండి.. ‘రావు బహాదూర్’పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
మనం అసలు సినిమాలను ఎందుకు ప్రేమించామో గుర్తుచేసే అత్యంత అరుదైన, గొప్ప చిత్రాలలో ఇది ఒకటి. సినిమాను ప్రాణంగా ప్రేమించే ప్రతి ఒక్కరికీ నాదొక చిన్న విన్నపం.

దిశ, సినిమా: నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రావు బహదూర్’. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించగా.. సైకలాజికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కేరాఫ్ కంచెరపాలెం’ తర్వాత మహా నుంచి డైరెక్ట్ సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ చిత్రం ఇటీవల థియేటర్స్‌లోకి వచ్చి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకోగా.. సినీ ప్రముఖుల నుంచి మాత్రం భారీ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా విడుదల కాకముందే.. చిత్ర సమర్పకుడిగా వ్యవహరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను ఎంతగానో అభినందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్ హీరోలు నాగచైతన్య, నిఖిల్ సిద్ధార్థ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి తమ ప్రశంసలు కురిపించారు. తాజాగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'రావు బహదూర్' సినిమాను చూసి ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ఇదొక అరుదైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని ప్రశంసిస్తూ, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అస్సలు మిస్ అవ్వద్దని కోరారు.
"మనం అసలు సినిమాలను ఎందుకు ప్రేమించామో గుర్తుచేసే అత్యంత అరుదైన, గొప్ప చిత్రాలలో ఇది ఒకటి. సినిమాను ప్రాణంగా ప్రేమించే ప్రతి ఒక్కరికీ నాదొక చిన్న విన్నపం. మీ జీవితంలో ఒక మూడు గంటల సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించండి. మీ శ్రద్ధకు, మీ ఓపికకు, మీ చప్పట్లకు ఈ మూవీ ఖచ్చితంగా అర్హమైనది" అంటూ కీలక విజ్ఞప్తి చేశారు. పరిమిత బడ్జెట్, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతమైన ఖచ్చితత్వంతో తెరకెక్కించారని సందీప్ రెడ్డి వంగా ప్రశంసించారు. ఇలాంటి విభిన్నమైన సినిమాను రూపొందించడానికి ఎంతో ధైర్యం, బలమైన నమ్మకం కావాలని పేర్కొన్నారు. ఇక హీరో సత్యదేవ్ నటన గురించి మాట్లాడుతూ.. సత్యదేవ్ అద్భుతంగా నటించారు. ఎలాంటి హడావుడి లేదు, షార్ట్‌కట్‌లు లేవు.. కేవలం ప్యూర్ ఫిల్మ్ మేకింగ్ మాత్రమే కనిపించింది. కల్తీ లేని కథాంశంతో, రాజీపడని రీతిలో సినిమాను నిర్మించిన విధానాన్ని అభినందించారు. చివరగా 'రావు బహదూర్' చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలియజేస్తూ.. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలని సందీప్ రెడ్డి వంగా రాసుకొచ్చారు.






