తిరుమల అప్‌డేట్స్: తగ్గిన భక్తుల రద్దీ.. 6 గంటల్లోనే సర్వదర్శనం!

by Malleboina Mahesh |

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ! 6 గంటల్లోనే సర్వదర్శనం. నిన్న 73వేల మందికి దర్శనం, రూ.4.30 కోట్ల హుండీ ఆదాయం. నేటితో ముగియనున్న వసంతోత్సవాలు.

తిరుమల అప్‌డేట్స్: తగ్గిన భక్తుల రద్దీ.. 6 గంటల్లోనే సర్వదర్శనం!
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ (Crowd of devotees) బుధవారం కాస్త తగ్గినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 4 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. దీనివల్ల టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ప్రారంభం కావడానికి ముందే భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం లభిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే మంగళవారం 73,519 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 21,564 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తుల కానుకలతో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.30 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Next Story