తిరుమల అప్‌డేట్స్.. పెరిగిన భక్తుల రద్దీతో దర్శనానికి 12 గంటల సమయం

by Malleboina Mahesh |

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచివున్న ప్రయాణికులు.. టోకెన్ లేని సర్వదర్శనానికి 12 గంటల సమయం!

తిరుమల అప్‌డేట్స్.. పెరిగిన భక్తుల రద్దీతో దర్శనానికి 12 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల కొండపై కొలువై ఉన్న కలియుగ దైవం అయిన శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయం సమయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఎలాంటి టైం స్లాట్ దర్శనం టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వదర్శనం (Free Darshan) లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే నిన్న (బుధవారం) ఒక్కరోజే మొత్తం 70,139 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అందులో 34,940 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల ద్వారా తిరుమల హుండీ ఆదాయం రూ. 4.63 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో క్యూలైన్లలో వేచి ఉన్న ప్రయాణికులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు నిరంతరాయంగా అందేలా టీటీడీ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.



Next Story