కాసేపట్లో కొత్త రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం.. ప్రమాణం చేయించనున్న చైర్మన్ రాధాకృష్ణన్

by Kema Shiva Kumar |

కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది.

కాసేపట్లో కొత్త రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం.. ప్రమాణం చేయించనున్న చైర్మన్ రాధాకృష్ణన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభకు (Rajya Sabha) ఇటీవలే కొత్తగా ఎన్నికైన 24 మంది సభ్యుల ప్రమాణ స్వీకార ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఇందులో భాగంగా ఇవాళ పార్లమెంట్‌లోని రాజ్యసభ ఛాంబర్‌లో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. తొలి విడతగా ఇవాళ 10 మంది కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం (Rajya Sabha MP Oath) చేయనున్నట్లుగా పార్లమెంట్ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది.

రాజ్యసభ ఛాంబర్‌లో జరిగే ఈ అధికారిక కార్యక్రమంలో రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ (Radhakrishnan) కొత్త సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన 24 మంది సభ్యులలో 10 మంది సభ్యులు బాధ్యతలు స్వీరించనుండగా.. మిగిలిన వారు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ ప్రమాణం చేయనున్న 10 మంది సభ్యులలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి ఎన్నికైన నలుగురు కీలక నేతల్లో సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్, భాష్యం రామకృష్ణ ఉన్నారు.

Next Story