- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రైవర్లు, కండక్టర్లపై మహిళల దాడులు.. నిరసనగా ఆర్టీసీ బస్సులు నిలిపివేత
కండక్టర్లు, డ్రైవర్లపై మహిళా ప్రయాణికుల దాడులకు నిరసనగా సిబ్బంది ఆందోళన, అవనిగడ్డ డిపోలో ఆర్టీసీ బస్సుల బంద్.

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల హామిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు పథకం వల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాల నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బంది, మహిళా ప్రయాణికుల మధ్య వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మహిళా ప్రయాణికులు తమపై దురుసుగా ప్రవర్తిస్తూ, దాడులకు దిగుతున్నారనే నెపంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు గురువారం ఉదయం హఠాత్తుగా బస్సు సర్వీసులను నిలిపివేశారు. డిపో గేటు వద్దే నిరసనకు దిగడంతో వందలాది మంది ప్రయాణికులు, ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు బస్టాండ్‌లోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటి నుంచి బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలోనూ, బస్ స్టాప్‌ల వద్ద బస్సులు ఆపే క్రమంలోనూ రోజువారీగా మహిళా ప్రయాణికులతో తీవ్ర వివాదాలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న సిబ్బందిపై కొందరు మహిళలు ఏకంగా దాడులకు తెగబడుతున్నారని, తమకు కనీస రక్షణ కరువైందని ధ్వజమెత్తారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సిబ్బందికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకునేంత వరకు బస్సులు నడిపే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో డిపో పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.






