- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల ప్రభంజనం.. రికార్డు స్థాయిలో 98 వేల మందికి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 98 వేల మంది స్వామిని దర్శించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో భక్తుల రద్దీ (Crowd of devotees) కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో పాఠశాలలు ఓపెన్ చేయనుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. దీంతో ఆదివారం రికార్డు స్థాయిలో 98 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఈ రోజు ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Queue Complex) లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు దాటి వెలుపల ఉన్న నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లలో భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (Sarvadarsanam) సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో (ఆదివారం) ఏకంగా 98,058 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. స్వామివారికి మొక్కులు చెల్లించుకుని తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 49,234 గా నమోదైంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.09 కోట్లు రాగా.. రికార్డు స్థాయిలో 4.2 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు. భక్తులకు క్యూలైన్లలో నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.






