తిరుమల అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

by Malleboina Mahesh |

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న 69 వేల మందికి పైగా దర్శనం. హుండీ ఆదాయం రూ. 3.85 కోట్లు.

తిరుమల అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల తిరుపతిలో మరోసారి భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం శ్రీ వారి దర్శనం కోసం తిరుమలలో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 7 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం (SSD) లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు. భక్తులు తమ వంతు వచ్చే వరకు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాలని కోరారు.

ఇదిలా ఉంటే బుధవారం రోజంతా కలిపి మొత్తం 69,649 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ 24,644 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.85 కోట్ల ఆదాయం సమకూరింది. వేసవి సెలవులు దగ్గరపడుతుండటంతో రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదం, తాగునీరు వంటి సౌకర్యాలను టీటీడీ నిరంతరాయంగా పర్యవేక్షిస్తోంది.

Next Story