టీటీడీ వర్సెస్ షిర్డీ సాయి: నిధులు ఇవ్వకపోవడంపై మంత్రి ఆనం క్లారిటీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-22 08:19:00  IST  )

దేశంలో చాలా చాలా ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయాలే కాక ఇతర దేవుళ్ల ఆలయాలు కూడా టీటీడీ పరిధిలో కొనసాగుతున్నాయి. టీటీడీ నిధులను ఆయా ఆలయాల్లో దూపదీప నైవధ్యాలతో పాటు ఉత్సవాలు, అభివృద్ధికి వినియోగిస్తున్నారు. ..

టీటీడీ వర్సెస్ షిర్డీ సాయి: నిధులు ఇవ్వకపోవడంపై మంత్రి ఆనం క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో చాలా చాలా ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయాలే కాక ఇతర దేవుళ్ల ఆలయాలు కూడా టీటీడీ పరిధిలో కొనసాగుతున్నాయి. టీటీడీ నిధులను ఆయా ఆలయాల్లో దూపదీప నైవధ్యాలతో పాటు ఉత్సవాలు, అభివృద్ధికి వినియోగిస్తున్నారు. అయితే షిర్డీ సాయి బాబా ఆలయాలకు టీటీడీ నిధులు వినియోగించాలని కొంతమంది భక్తుల నుంచి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

షిర్డీ సాయి ఆలయాలకు నిధులు ఇవ్వలేం..

ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సాయి భక్తుల్లో హిందువులతో పాటు ఇతరులు ఉన్నారని, తమ శాఖ హిందూదేవాదాయ శాఖ పరిధిలోనే పని చేయాలని చెప్పారు. పురాణ గ్రంథాలు, పౌరాణిక శాస్త్రాల్లో షిర్డీ సాయి లేరని తెలిపారు. సాయి ఆలయాలకు చాలా మంది, సంస్థల నుంచి ఆర్థికంగా విరాళాలు అందుతున్నాయని చెప్పారు. ఈ కారణాలతో షిర్డీ సాయి ఆలయాలకు టీటీడీ నిధులు వినియోగించమనే విషయాన్ని మంత్రి ఆనం స్పష్టం చేశారు. షిర్డీ సాయి ఆలయాల్లో వైదిక, ఆగమశాస్త్ర ప్రకారం పూజలు జరగడంలేదన్నారు. అందువల్ల షిర్డీ సాయిబాబా ఆలయాలను టీటీడీ నిధులతో నిర్మించలేమని ఆనం వెల్లడించారు. శ్రీవాణి నిధుల వినియోగంలో ప్రోటోకాల్ ఉందని, అందువల్లే సాయి ఆలయాలకు నిధులు వెచ్చించలేమని ఆయన పేర్కొన్నారు.

Next Story